![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-192లో.. ముకుంద ఫామ్ హౌస్ దగ్గర అన్నీ చూసుకునే ఆమెతో సెటిల్ చేసి.. కృష్ణ, మురారీల కోసం ఎదురుచూస్తుంది. మరొకవైపు ముకుంద గురించి రేవతి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. అప్పుడు పెద్దమ్మ అంటూ మధు అక్కడికి వస్తాడు. నేను ఇక్కడే ఉన్నా కదరా ఎందుకు అరుస్తున్నావని అడుగగా.. షూటింగ్ లో లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ అరిచి అలా అలవాటైందని మధు అంటాడు. 24 గంటలు ఇంట్లో ఉండే నువ్వు షూటింగ్స్ కూడా వెళ్తావా.. సరే విషయమేంటో చెప్పు అని రేవతి అనగా.. మొదట అమితాబచ్చన్ ని కూడా నాలాగే అవమానించరంట అని మధు అంటాడు. ముందు నీ గురించి నువ్వు ఆలోచించు బాగుపడతావని రేవతి అనగానే మధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
కృష్ణ, మురారీలు ఇద్దరు ఫామ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ వారిద్దరి కోసం ఎదురుచూస్తున్న రాజనర్సమ్మకి కృష్ణని పరిచయం చేస్తాడు మురారి. ఆ తర్వాత అక్కడ ఉన్న చెట్లని, నేచర్ ని కృష్ణ చాలా బాగుందని చెప్తుంది. ఏసీపీ సర్ మీకొకటి చెప్పాలని కృష్ణ అంటుంది. ఏంటని చాలా ఆత్రుతగా కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. ఏం లేదు.. మీరు మంచోళ్ళు.. మంచి మనసున్న వాళ్ళని కృష్ణ అంటుంది. "అయ్యో కృష్ణ ఈ మాట కొన్ని వందల సార్లు చెప్పావ్.. జోక్స్ ఆపి చెప్పాలనుకున్నది చెప్పేయ్" అని కృష్ణతో మురారి అంటాడు. అయితే సరే నా మనసులో ఏం ఉందో నువ్వే చెప్పెయ్ అని మురారితో కృష్ణ అంటుంది. మురారి ఆలోచనలో పడి మౌనంగా ఉంటాడు.
మరొకవైపు ఇంట్లో ఉన్న మధు, అతని భార్య కలిసి ఏ రీల్ చేద్దామని ఆలోచిస్తుంటారు. కొత్తగా చేయాలని మధు అనగా.. మురారి, ముకుంద లాగా మనం మన క్యారెక్టర్స్ ని ఎక్సేంజ్ చేసుకొని రీల్ చేద్దామని మధుతో అతని భార్య అంటుంది. ఆ తర్వాత ముకుందలాగా గులాబిని తీసుకొని మధుకి ఇస్తూ ప్రపోజ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి రేవతి వచ్చి ఇద్దరిని కొట్టి.. ఇలాంటి చెత్త రీల్స్ చేస్తే తోలు వొలిచేస్తానని చెప్పగానే ఇద్దరు పారిపోతారు.
మరొకవైపు ఫామ్ హౌస్ లో ఉన్న మురారి ఆలోనలో పడతాడు. కాసేపటికి కృష్ణ చెట్టు ఎక్కుతుంది. మురారి వెళ్లి దిగమని చెప్పినా దిగకుండా చెట్టు మీద ఉండి ఫోజులు ఇస్తుంది కృష్ణ. కాసేపటికి పై కొమ్మకి వెళ్తానని కృష్ణ వెళ్తుండగా స్లిప్ అయి పడిపోగా.. మురారి పట్టుకుంటాడు. ఇదంతా ముకుంద దూరం నుండి చూస్తూ.. ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టాలని అసూయతో రగిలిపోతుంది. కృష్ణని ఎత్తుకొని మురారి ఒకటి చెప్పాలని అనగా... నన్ను దింపండి ఆ పూలు బాగున్నాయని కవర్ చేసి దిగిపోయి ముందుకు వచ్చేస్తుంది కృష్ణ. మురారి తను ప్రేమిస్తున్న విషయం చెప్పాలనుకుంటాడు. మురారి తన డైరీలోని అమ్మాయి గురించి చెప్తాడేమోనని కంగారుగా ఉంటుంది కృష్ణ. వాళ్ళిద్దరిని అలా సంతోషంగా చూసిన ముకుంద ఏడుస్తుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టాలని తను తీసిన ఫోటోలని, వీడియోలని మురారికి పంపించాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |